2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా నాగపుర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు. సోమవారం జార్జియాలోని బటుమిలో జరిగిన టైబ్రేక్ రెండవ ర్యాపిడ్ గేమ్‌లో తెలుగు తేజం కోనేరు హంపీని ఓడించి (2.5-1.5) టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా దివ్య చరిత్ర…