CM Nitish Kumar: బీహార్ లోని ‘మహాగటబంధన్’ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయి. మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీపై ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ఆరోపణలు ఎక్కుపెట్టారు. మాంఝీ కూటమి విషయాలను బీజేపీకి లీక్ చేస్తున్నట్లు ఆరోపించారు. మాంఝీని ముందు ఈ నెల 23న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనాలని నితీష్ కోరారు.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విపక్షాల ఐక్యత గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడకుంటే.. తర్వాత భారతదేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని ఆప్ గురువారం ఆరోపించింది.
AAP: కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం మహా ర్యాలీ నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిర్వహించిన మహార్యాలీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై కేజ్రవాల్ విరుచుకుపడ్డాడు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం లేని పార్టీని దేశంలో చూపించండి అంటూ దేవెగౌడ సవాల్ విసిరారు. దేశం మొత్తంలో ఒక్కపార్టీనైనా చూపించాలని, అప్పుడు నేను సమాధానం చెబుతానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న విపక్ష ఐక్యత ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు దేవెగౌడ మంగళవారం సమధానమిచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు జూన్ 12న పాట్నాలో సమావేశం కానున్నాయి. 18కి పైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ సదస్సుకు హాజరు కానున్నాయి.
Amit Shah: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. గౌహతిలో ఓ కార్యక్రమానికి హాజరైన షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధినేత విపక్షాల పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విపక్షాలతో కలిసి పోటీ చేయమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ ఒంటరిగానే పోలీ చేస్తుందని ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని డిమాండ్ల గురించి ప్రధాని మోడీని కలిసినట్లు చెప్పారు.
Kangana Ranaut's key comments on contesting the Lok Sabha elections: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. తాజాగా ఆమె రాజకీయాల గురించి మనసులో మాట బయటపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రజలు కోరుకుంటే మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేషనల్ ఛానెల్ కు ఇచ్చిన ఓ…
నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనే స్వయంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
BJP has appointed in-charges for many states: బీజేపీ 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తం అవుతోంది. ఇటీవల కేంద్ర మంత్రులతో సమావేశం అయిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2024 ఎన్నికలపై సమాయత్తం కావాలని సూచించారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో అతి తక్కువ తేడాతో ఓడిపోయిన 144కు లోక్ సభ స్థానాలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో వీటిల్లో గెలవాలని ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు బీజేపీ…