Kangana Ranaut: కంగనా మనసులో మాట.. లోక్ సభకు పోటీపై క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut’s key comments on contesting the Lok Sabha elections: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఏదో విధంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. తాజాగా ఆమె రాజకీయాల గురించి మనసులో మాట బయటపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రజలు కోరుకుంటే మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నేషనల్ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ తనకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.
రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా..?అని ప్రశ్నించిన సమయంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రభుత్వం తన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఆమె అన్నారు. నేను చెప్పినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నాకు సేవ చేయడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడుతూ.. ‘‘ మహాపురుష్’’ అని పొగిడారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ పోటీదారుడు కావడం విచారకరమని .. మోదీకి ప్రత్యర్థులు లేరని అన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: MLAs Resignation: ఇదేం గోలరా నాయనా.. ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు వాగ్ధానాలకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు పడబోరని అన్నారు. హిమాచల్ ప్రజలకు సొంతంగా సోలార్ విద్యుత్ ఉందని.. ప్రజలు సొంతగా కూరగాయలు పండించుకుంటున్నారని కంగనా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆప్ ఉచితాలు పనికి రావని అన్నారు. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ ‘‘ఎమర్జెన్సీ’’ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఆమె కనిపించబోతోంది. అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేజస్, టింక్ వెడ్స్ షేరూ సినిమాల్లో నటిస్తోంది కంగనా.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!