మణిపూర్‌లో జాతి హింస చెలరేగిన 862 రోజుల తర్వాత, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనకు వెళ్తున్నారు. 2023 హింస తర్వాత ఆయన తొలిసారి మణిపూర్ లో పర్యటిస్తున్నారు. మణిపూర్ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 13న ప్రధాని మోడీ మణిపూర్ కు చేరుకుని రూ.8500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ప్రకటించారు. ప్రధాని మోడీ ముందుగా చురచంద్‌పూర్ వెళ్లి, అక్కడ జిల్లాలోని కొంతమంది నిరాశ్రయులైన ప్రజలను కలుస్తారని తెలిపారు.…