నేడు మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు రేపు కూడా రాష్ట్రంలో అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, రేపు తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే, ఎల్లుండి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు.
మల్కాజ్ గిరి ఎన్నికల వ్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు మంత్రి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ వయస్సుకు మించి మాట్లాడుతున్నాడు.. ఇక్కడ మోడీని గూండా అని తిట్టి.. ఢిల్లీకి వెళ్లి ఆయన కాళ్లు పెట్టుకుంటావు.. బీజేపీతో మ్యాచ్ పికెటింగ్ చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం మరింత స్పీడ్ పెంచారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు.
దుబ్బాకకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం.. నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది.. మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ఓవైసీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లాలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చెట్టుకి పన్ను రద్దు చేశామని చెప్పారు.
హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ పర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరాన్ని బద్నాం చేయవద్దు.. బ్యారేజ్ లలో సమస్యలు రావడం సహజం అంటూ వ్యాఖ్యనించారు.