రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కనీలో వేలాడదీశాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఆ ప్లేయర్ పేరును చాహల్ వెల్లడించలేదు. తాజాగా చాహల్ వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చాహల్ సదరు ఆటగాడి పేరు…