చేనేతలో కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పించి ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకుంటాం.. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200యూనిట్లు, పవర్ లూమ్ కు 500యూనిట్లు ఉచితంగా ఇస్తాం.. 5 శాతం జీఎస్టీని రీయింబర్స్ చేస్తాం.. 50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తాం.. అమరాతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.