ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళయాళ ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజా. ఆయన తొలి చిత్రం ‘హనుమాన్ జంక్షన్’. ఈ చిత్రం విడుదలై డిసెంబర్ 21కి అక్షరాలా ఇరవై ఏళ్ళు పూర్తయింది. ప్రముఖ నిర్మాత, ఎడిటర్ మోహన్ పెద్దకొడుకు రాజా. రీమేక్ మూవీస్ ను తెరకెక్కించడంలో మేటి ఎడిటర్ మోహన్ అని అందరికీ తెలుసు. ఆయన చిత్రాలన్నిటికీ మోహన్ సతీమణి ఎమ్.వి.లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు. ‘హనుమాన్ జంక్షన్’ చిత్రానికి కూడా…