ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో అడవులు దద్దరిల్లాయి. మావోల ఏరివేత ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు బుధవారం కూడా మావోల కోసం జల్లెడ పట్టాయి. దీంతో నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోలు ఎదురుపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక 20 మంది మావోల్లో 11 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది.