సినిమా నిర్మాణమంటే కోట్లతో కూడిన వ్యవహారం. అందువల్ల పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కోసం ఎలాంటి కమర్షియల్ హంగులు జోడించాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అయితే అదే సినిమా ద్వారా సమాజానికి ఏదైనా ఓ మంచి చెప్పాలని తాపత్రయపడే దర్శక నిర్మాతలూ కొందరుంటారు. మనసులో మెదిలిన భావాలను పదిమందికి అందించడమే వారి లక్ష్యంగా ఉంటుంది. అలా నిజాయితీతో చేసిన ప్రయత్నాలు ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పిస్తాయనేది పక్కన పెడితే, మేకర్స్ కు ఓ తృప్తి అయితే ఖచ్చితంగా లభిస్తుంది.…
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘1997’. డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు డాక్టర్ మోహన్ చెబుతున్నారు. ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ముగ్గురు ప్రధాన పాత్రధారుల లుక్స్ పోస్టర్స్ ను కూడా విడుదల…