ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడి 19 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు స్కూటర్‌పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు యువకుడి తలపై పడింది. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) జరిగింది. పక్కనే నిల్చున్న మృతుడి స్నేహితుడికి కూడా ఏసీ తగలడంతో అతను కింద పడిపోయాడు.