గోవును తల్లిగా భావిస్తాం. గోవుల సంరక్షణకు ఖర్చుపెడుతున్నా.. కొన్ని గోవులు మాత్రం దాణా లేక తిరిగి రాని లోకాలకు చేరిపోతున్నాయి. విశాఖపట్నంలోని రామానంద ఆశ్రమంలో గోవుల బాధ అంతా ఇంతా కాదు. గో మరణాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 4 గోవులు మృతిచెందాయి. దాణా, నీరు లేక కోమాలోకి వెళుతున్నాయి గోవులు. రామానంద ఆశ్రమంలో ఆకలితో అల్లాడుతున్నాయి 160కి పైగా గోవులు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి అక్రమంగా తరలిస్తోన్న 160 గోవులను పట్టుకుని…