యంగ్ టైగర్ యన్టీఆర్ ను తాతకు తగ్గ మనవడుగా నిలిపిన చిత్రాలలో ‘రాఖీ’ తప్పకుండా చోటు సంపాదిస్తుంది. ఇందులోని కోర్టు సీన్ లో జూనియర్ యన్టీఆర్ నటన, ‘బొబ్బిలిపులి’లో నటరత్న యన్టీఆర్ ను గుర్తు చేసిందని ఎందరో అన్నారు. సాక్షాత్తు ‘బొబ్బిలిపులి’ చిత్ర నిర్దేశకులు దాసరి నారాయణరావు ‘తాతను గుర్తు చేశాడు తారక్’ అంటూ అభినందించారు. ‘రాఖీ’ టైటిల్ కు తగ్గట్టుగానే కథలో ఎంతోమంది హీరోని అన్నయ్యగా భావించి, అతనికి రాఖీలు కట్టడం భలేగా ఆకట్టుకుంది. 2006…