ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించినవారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి మాట్లాడారు. పదవులు రానివారికి బుజ్జగింపుల పర్వం మొదలయ్యిందని అంటున్నారు. బాలినేని నివాసంలో ఎక్కడా సందడి కనిపించడంలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలినేని నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు గేటు బయటే పడిగాపులు పడుతున్నారు.…