నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం పాకిస్థాన్‌లోని తన సొంత గడ్డపై అడుగుపెట్టింది. 13 ఏళ్ల తర్వాత ఆమె తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి, భర్త, సోదరుడు హై సెక్యూరిటీ మధ్య పాక్‌కు చేరుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమెపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. స్వాత్ లోయలో ఉగ్రవాదులు బస్సు ఎక్కి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి.
అక్రమంగా సంపాదించారనే ఆరోపణలపై చైనాలో ఓ మహిళా అధికారికి 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా.. 10 లక్షల యువాన్లు (సుమారు రూ. 1.18 కోట్లు) జరిమానా విధించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఝాంగ్ యాంగ్ గుయిజౌ కియానాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లో డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశారు.
నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న సాక్ష్యాధారాలు లేని కారణంగా ఓ ఖైదీకి విధించిన జీవిత ఖైదును అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో అతన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.