టర్కీలోని ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. బాలికేసిర్ ప్రావిన్స్‌లో ఉన్న క్యాప్సూల్ ఉత్పత్తి కేంద్రంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా తెలిపింది.
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారు. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
పాకిస్థాన్ లోని కరాచీలో శుక్రవారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది. భాద్ ఘర్ లో 12 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.