కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల వల్ల తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చ్ 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత జరిగిన దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెల్లడించింది.