మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటజీవితం భావితరాలను సైతం ప్రభావితం చేస్తూనే ఉంది. నవతరం ప్రేక్షకులు సైతం యన్టీఆర్ నటించిన చిత్రాలను బుల్లితెరపైనా, చిత్రోత్సవాల్లో చూసి ఆనందిస్తున్నారు. ఈ నాటి మేటి నటీనటులు సైతం ఆ మహానటుని అభినయపటిమను శ్లాఘిస్తున్నారు. నటనలో రాణించాలనుకొనేవారు నటరత్న నటనావైభవాన్ని అధ్యయనం చేయాలని తపిస్తున్నారు. నటసార్వభౌముని జయంతి సందర్భంగా అధ్యయనం చేయవలసిన ఆయన శత చిత్రాలను మీ కోసం ఎంపిక చేశాం. ఇవే కాకుండా మరో వందకు పైగా…