ఆస్కార్స్ 2022 వేదికపై జరిగిన విల్ – రాక్ సంఘటన షాకింగ్ నిర్ణయానికి దారి తీసింది. విల్ స్మిత్ ను అకాడమీ అవార్డుల నుండి పదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అకాడమీ నిర్ణయాన్ని విల్ స్మిత్ కూడా గౌరవించారు. అకాడమీ తమ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత విల్ స్మిత్ స్పందిస్తూ “నేను అకాడమీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను, గౌరవిస్తాను” అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ” 2022 ఏప్రిల్ 8 నుండి 10 సంవత్సరాల…
హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ను ఆస్కార్ ఈవెంట్ లో జరిగిన ఘటన వదిలేలా కన్పించడం లేదు. విల్ తనకు చేసిన పనికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన 94వ అకాడమీ అవార్డ్స్‌లో వేదికపైనే హాలీవుడ్ హాస్యనటుడు క్రిస్ రాక్ చెంప పగల గొట్టాడు. విల్ భార్య జాడా అలోపేసియా అనే జుట్టు రాలే వ్యాధితో పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఆమె గుండుపై ఆస్కార్ వేడుకల్లో క్రిస్ కామెడీ చేయడం ఈ అనూహ్య…