దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు…
బీహార్‌లోని బంకాలో జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మోతిహారిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బంకాలోని పొదల మధ్య ఉన్న బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
తూర్పు ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించగా, 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. తబాస్ సమీపానికి చేరుకున్న తర్వాత రైలులోని ఏడు బోగీల్లో నాలుగు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. మూడు హెలికాప్టర్లలో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి…