బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వం విధానాలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల కేంద్రం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు కేటీఆర్. ప్రతపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత కేంద్రంపై భారీ ఒత్తిడి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.…