బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. సరన్‌లో ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వేస్టేషన్‌లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లాట్‌ఫామ్-1పై ఒకరు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి తెలిపారు.
మణిపూర్‌లో డ్రోన్ బాంబు దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ గాయపడింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంజామ్ చిరాంగ్‌లో సోమవారం జరిగిన మరో డ్రోన్ బాంబు దాడిలో 23 ఏళ్ల మహిళ గాయపడినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.