Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఏపీఎస్ఈసీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా…నామినేషన్లు వేసుకునేందుకు వైసీపీ రెండ్రోజులు అవకాశం ఇస్తుందా ? జిల్లా పరిషత్, మండల ఎన్నికల తర్వాత పోలింగ్ నిర్వహిస్తుందా ? ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల ఇచ్చే నివేదికలపైనే ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారపడి ఉంది. ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. స్థానిక సమరమా? అసెంబ్లీ ఎన్నికలా? ఏపీలో పరిస్థితి చూస్తుంటే ఇలానే అనిపిస్తోంది. ఇటు సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నివేదిక ఆధారంగా మున్సిపల్ ఎన్నికల్ని రీషెడ్యూల్ చేసింది. ఇటు తాజా పరిణామాల్ని అన్ని పార్టీలు గమనిస్తూ భవిష్యత్ ప్రణాళికల్లో మునిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వంద మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను సవరిస్తూ కొత్త తేదీలను ప్రకటించింది ఎస్ఈసీ. అక్టోబర్ 28న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 1కి వాయిదా వేయగా, ఓట్ల లెక్కింపును నవంబర్ 3న నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు, అడ్డంకులు, దాడుల ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం. అలాగే నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు ఎదురైనట్లు గుర్తించిన నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో ఎంపిక చేసిన వార్డులకు మరో అవకాశం కల్పించారు. దీంతో ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుకు వెసులుబాటు కలగనుంది.
Also Read
నామినేషన్ల ప్రక్రియలో సమస్యలు ఎదురైనట్లు గుర్తించిన కడప, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీల్లోని ఎంపిక చేసిన వార్డులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు ఇవాళ, రేపు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. అయితే ఈ వెసులుబాటు ఆయా పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని వార్డులకు కాకుండా, ఎన్నికల సంఘం గుర్తించిన నిర్దిష్ట వార్డులకే వర్తించనుంది.గతంలో నామినేషన్ల స్వీకరణకు నిర్ణయించిన కేంద్రాలతో పాటు కలెక్టరేట్ ప్రాంగణాల్లోనూ పత్రాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల ప్రక్రియలో వారికి అవకాశం కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశంగా కనిపిస్తోంది.
నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థుల పత్రాలను అక్టోబర్ 25న పరిశీలించనున్నారు. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థులకు అదే రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రచురించనున్నారు. దీంతో ఎన్నికల బరిలో ఎవరెవరు నిలవనున్నారనే దానిపై స్పష్టత రానుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియను నిర్ణీత సమయాల్లో పూర్తి చేసి, పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాల్సి ఉంటుంది. కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికల అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఏవైనా కారణాలతో కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే నవంబర్ 2న చేపట్టనున్నారు. అనంతరం నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్ తేదీ మారడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కూడా కొత్త షెడ్యూల్ ప్రకారం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ వంటి అంశాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించనుంది.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు రావడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలపైనా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆశావహులు, రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తేదీల సవరణ నేపథ్యంలో ఇతర స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పైనా త్వరలో స్పష్టత రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలపై అధికారిక ప్రకటన వెలువడే వరకు నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది.సవరించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. నామినేషన్లకు మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో అభ్యర్థులు నిర్ణీత గడువుల్లో పత్రాలు సమర్పించడం, ఎన్నికల సంఘం నిబంధనలు పాటించడం అవసరం. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంతంగా పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు..నామినేషన్ల దాఖలు చేసే సమయంలో కేసుల్లేవని పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, పురపాలక సంస్థలకు బకాయిలు లేవని తెలిపే నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిబంధన ఎన్నికల నియమావళిలో లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ సర్టిఫికెట్లు వెంటనే సమర్పించాలని కొందరు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు కోరుతున్నట్లు పలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఎన్నికల నియమావళిలో లేని అదనపు నిబంధనలు విధించరాదని ఎస్ఈసీ అధికారులను ఆదేశించింది. అర్హులైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
వైసీపీ కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తోందని కూటమి నేతలు ఆరోపించారు. సకాలంలో ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని, గడువులోగా ఎన్నికలు నిర్వహించి అభివృద్ధి పనులు చేపట్టాలన్నది తమ ఉద్దేశమని అన్నారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ పలుమార్లు కోర్టులను ఆశ్రయించిందని, ఎన్నికలు జరిగే సమయంలో హింసను ప్రేరేపించిందని విమర్శించారు.
మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, హింసపై సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, హింసను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుందని.. అందుకనే ఎస్ఈసీకి ఆదేశాలు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పురాలేదన్న జగన్…ఎంపీటీసీ, జడ్పీటీసీల్లోనూ హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే హింసకు పాల్పడ్డం ఎక్కడా చూసి ఉండమన్నారు. పోలీసులను వాడుకుని ఈ దారుణాలన్నీ చంద్రబాబు చేయిస్తున్నారన్న జగన్… క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు తిరుగులేని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదిశగా గొప్పగా పోరాటం చేస్తున్నారని…నాయకులు, కార్యకర్తలకు జగన్ కితాబిచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!