Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు.. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని ఫిర్యాదు చేసిన చోటే పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో నామినేషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు, సీసీటీవీ కవరేజ్‌ను ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను…దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. మున్సిపల్ ఎలక్షన్స్‌కు సంబంధించి 19 చోట్ల తమను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారంటూ…వైసీపీ పిటిషన్లో ప్రస్తావించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. నామినేషన్ల గడువు పొడిగించాలన్న వైసీపీ వినతిని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటించవద్దన్న న్యాయస్థానం…శాంతిభద్రతల సమస్యతో ఎక్కడెక్కడ నామినేషన్లు వేయలేకపోయారో చూడాలని SECకి సూచించింది. రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని SECకి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ పిటిషన్‌పై జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహన…ధర్మాసనం విచారణ జరిపింది. వైసీపీ చెప్పిన అంశాలు, అభ్యర్థులు చెప్పినవి..వీడియో క్లిప్స్ చూసి నిర్ణయాలు తీసుకోవాలని SECకి సుప్రీం సూచనలు చేసింది. SEC నిర్ణయం తీసుకున్నాక.. 48 గంటల పొడిగింపు ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను…ఈ నెల 25కి వాయిదా వేయాలని సూచించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఏపీ డీజీపీదేనన్న న్యాయస్థానం…నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని…సీసీటీవీతో కవర్ చేయాలని ఆదేశించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు మొత్తంగా వాయిదాకు, గడువు పొడిగింపునకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఇదే సమయంలో నామినేషన్లను అడ్డుకున్నారని ఫిర్యాదులు చేసిన చోటే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
Also Read
అయితే కోర్టుల్లో కేసులు వేయడం తప్ప ఎక్కడా ఫిర్యాదులు చేయలేదని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం నామినేషన్లను అడ్డుకున్నారన్న ఫిర్యాదులపై రేపటిలోగా ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నామినేషన్లకు అవకాశం కల్పిస్తే కలెక్టర్ వద్ద కూడా దాఖలు చేసేలా పరిశీలించాలని ఆదేశించింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటన గడువును ఈనెల 25 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. కోర్టు ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఈ నెల 27న రిపోర్టు ఇవ్వాలని ఎస్ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని.. ప్రతిపక్షాలకు అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
వైసీపీ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎస్ఈసీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈనెల 15, 16 తేదీల్లో దురుద్దేశంతోనే హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్ కేంద్రంలో ఉన్నవారిని కారుతో ఢీకొట్టించారని లాయర్లు తెలిపారు. వైసీపీ చేసిన అరాచకంతో భద్రత మధ్య ప్రజలను తరలించాల్సి వచ్చిందని సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పఠాన్‌కోట్ నుంచి మారణాయుధాల కలిగిన దుండగులను వైసీపీ దిగుమతి చేసుకుందని ఎస్ఈసీ లాయర్లు తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాల వద్ద ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం రాజీ పడలేదని లాయర్లు స్పష్టం చేశారు.
63.5 శాతం వైసీపీ నామినేషన్లు లేకుండా చేశారని.. ఇది చాలా తీవ్రమైన చర్య అని వైసీపీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. వైసీపీ నేతలను కొట్టి వారిపైనే కేసులు పెట్టారని.. ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని వైసీపీ తరపున న్యాయవాది సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై ఈ రోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల్లో ఈ నెల 25వరకు అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించవద్దని ఏపీ ఎస్ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించడంపై విజయవాడలో ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. SEC పునేఠా, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సిగ్గుపడాలన్నారు. సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడానికి సిగ్గులేదా అని SECని ప్రశ్నించారు. స్థానిక సంస్థలను దుర్మార్గంగా తొక్కిపెడుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై ఏబీ వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు.
సుప్రీం కోర్టు ఆదేశాలతో 19 చోట్ల నామినేషన్లకు అనుమతినిచ్చే అవకాశముంది. కనిగిరి, దర్శి, పుంగనూరు, రాయచోటి, రాజంపేట, మైదుకూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, పిడుగురాళ్ల, తాడిపత్రి, గురజాల, కమలాపురం, దాచేపల్లి, జమ్మలమడుగు, తిరుపతి, బద్వేల్, పులివెందుల, కడప, గుత్తి తదితర ప్రాంతాల్లో నామినేషన్లకు సంబంధించి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి ఎస్ఈసీ నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశం నిర్వహించారు. న్యాయనిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణపై సమీక్షించారు. ఈ క్రమంలో 19 ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సందర్భంగా జరిగిన పరిణామాలపై ఎస్ఈసీ నివేదికలు తెప్పించుకుంటోంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గురువారంలోగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!