అభిమానులు అంత ఎంతగానో ఎదురు చూస్తున ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఆట కూడా జరిగే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. భారత కాలమాన ప్రకారం రెండో రోజు ఆట మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. నిన్న ఉదయం నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురవడంతో.. తొలి రోజు ఆట సగం రోజు వరకు సాగలేదు. అయితే డబ్ల్యూటీసీ మ్యాచ్ కోసం ఐసీసీ ఒక్క రిజర్వ్ డే ఉంచింది. కానీ ఇప్పుడు ఒకవేళ రెండో రోజు ఆట కూడా రద్దయితే ఐసీసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.