Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. దాయాది పాకిస్థాన్‌పై మరోసారి ఆధిపత్యాన్ని చూపింది.
పాకిస్థానే అత్యుత్తమ జట్టు:
ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లను భారత బౌలర్లు ఏమాత్రం కోలుకోనివ్వలేదు. తెలుగమ్మాయి శ్రీ చరణి మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లు తీశారు. భారత బౌలర్ల దాటికి పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18.1 ఓవర్లలోనే ముగిసింది. పాక్ తరఫున ఓపెనర్లు మునీబా అలీ (13), షావల్ జుల్ఫికర్ (14) మినహా.. ఏ బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అయితే ఈ ఘోర ఓటమి తర్వాత పాకిస్థాన్ మహిళల జట్టు కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భారత్ చేతిలో ఇంతటి ఘోర పరాజయం ఎదురైనప్పటికీ.. ప్రస్తుత ఆసియా కప్‌లో టైటిల్ గెలిచే సత్తా ఉన్న అత్యుత్తమ జట్టు పాకిస్థానే అని పేర్కొన్నాడు.
Also Read
- Fatima Sana: భారత్‌తో మ్యాచ్‌లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా!
- Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
- INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
తప్పకుండా కప్ కొడుతాం:
‘మా జట్టులోని ప్రతి ఒక్క ప్లేయర్లో అద్భుత నైపుణ్యం ఉంది. వారు తమపై తాము నమ్మకం ఉంచాల్సిన అవసరం వచ్చింది. మా తదుపరి మ్యాచ్ హాంకాంగ్‌తో ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో ఎక్కడ తప్పులు చేశామో చర్చిస్తాం. ఆ తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతాం. ఈ ఆసియా కప్‌లో ట్రోఫీ గెలిచే అత్యుత్తమ జట్టు పాకిస్థానే అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఇక్కడి పరిస్థితులు మాకు బాగా అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా కప్ కొడుతాం’ అని వహాబ్ రియాజ్ ధీమా వ్యక్తం చేశాడు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మార్పులు చేశాం:
అదే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ సనా మీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా వహాబ్ రియాజ్ స్పందించాడు. ఆసియా కప్ కోసం జట్టులో భారీగా మార్పులు చేయడాన్ని సనా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే సనా అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని వహాబ్ స్పష్టం చేశాడు. ‘సనాకు తన సొంత అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జట్టులో మార్పులు చేశాం. గతంలో ఆడిన ఆటగాళ్లు ఎన్నో ప్రపంచ కప్‌లు, ఆసియా కప్‌లు ఆడారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే కొత్త వారికి అవకాశం ఇచ్చి.. రాబోయే టోర్నీల కోసం జట్టును బలంగా నిర్మించాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పాడు.
అమ్మాయిలు సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు:
‘ఎవరిని జట్టు నుంచి తప్పించామన్నది ముఖ్యం కాదు. వాస్తవ పరిస్థితులను చూడాలి. జట్టు నుంచి తప్పించిన అమ్మాయిలు సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు. అందుకే కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం సరైన నిర్ణయమే అని నేను భావిస్తున్నాను’ అని వహాబ్ రియాజ్ పేర్కొన్నాడు. భారత్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇకపై జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్ ప్రయాణం అక్కడితోనే ముగిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!