Vizag One Day Match Tickets: ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాల్గో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.. తొలిరోజు ఆసీస్ ఆటగాళ్లు రాణించారు.. ఇక, టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత.. వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.. అందులో భాగంగా ఈ నెల 19న విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను రేపటి నుంచి విక్రయించనున్నారు. రేపు ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రకటించింది.. రేపు ఆన్‌లైన్‌లో అంటే పేటియం యాప్ ద్వారా టికెట్లను విక్రయించనుంది ఏసీఏ.. అయితే.. ఆఫ్ లైన్‌లో టికెట్ల విక్రయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. ముందుగా ఈ నెల 13వ తేదీన ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు.. దానికి తగినట్టుగా ఏర్పాట్లు కూడా చేసింది ఏసీఏ.. కానీ, 13వ తేదీన ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. 14వ తేదీన ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నారు.. విశాఖ నగరంలోని మూడు కేంద్రాలలో ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయించనుంది ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ)..
Read Also: Off The Record: భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..? ఏ పార్టీ నుంచి పోటీ..?
రేపు ఆన్‌లైన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది.. రూ. 600, రూ.1500, రూ. 2 వేలు, రూ. 3 వేలు, రూ. 3,500, రూ. 6 వేల టికెట్లను విక్రయిస్తారు. ఆఫ్‌లైన్ టిక్కెట్‌లను ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలలో కొనుగోలు చేయవచ్చు. ప్రాంగణంలోని ప్రవేశం, సీటింగ్ సౌలభ్యం కోసం అన్ని టిక్కెట్లు బార్-కోడ్ చేయబడ్డాయి. ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు సాధారణ ప్రజలకు ప్రవేశ ద్వారాలు తెరవబడతాయి మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు మూసివేయబడతాయి. ప్రజల సౌకర్యార్థం తగినన్ని పార్కింగ్ సౌకర్యాలతో అన్ని చోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. స్టేడియం లోపల ఉచితంగా తాగునీరు అందిస్తారు. అంబులెన్స్‌లు, ప్రత్యేక వైద్యులు మరియు వైద్య బృందాలు ప్రేక్షకుల కోసం నియమించబడిన ప్రదేశాలలో ఉంచబడతాయి.. అయితే, 2019లో వెస్టిండీస్‌తో భారత్ ఆడిన నాలుగు సంవత్సరాల తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్) స్టేడియం.. ఈ నెల 19న వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుంది.