Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. దారుణంగా పడిపోయిన సగటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 19 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ రెండో టెస్టులోనూ విఫలమ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేయగా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. దీంతో టెస్టు ఫార్మాట్లో గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కోహ్లీ నమోదు చేయలేకపోయాడు. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్లో విరాట్ బ్యాటింగ్ సగటు 50 కంటే తక్కువకు పడిపోయింది.
Read Also: Pushpa Kamal Dahal: నేపాల్ ప్రధానిగా ప్రచండ.. ముగిసిన సంక్షోభం
Also Read
- AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..
- Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
- APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్‌షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 27 శతకాలు, 28 అర్ధశతకాలతో 8,119 పరుగులను సాధించాడు. తన 52వ టెస్టులో యావరేజ్ 50కి పైగా నమోదైంది. అయితే ఇప్పుడు 104వ టెస్టు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ సగటు 50 కంటే కిందికి పడిపోయింది. ప్రస్తుతం అతడు 48.91 సగటుతో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డేల్లో 57.47, అంతర్జాతీయ టీ20ల్లో 52.74 సగటుతో విరాట్ కోహ్లీ ఉన్నాడు. టెస్టుల్లో కొంతకాలంగా కోహ్లీ ప్రదర్శన తీసికట్టుగా తయారైంది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్లో కోహ్లీ 12 టెస్టులు ఆడగా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ డబ్ల్యూటీసీలో కోహ్లీ అత్యధిక స్కోరు 79 కాగా మొత్తం మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!