Kohli 100 Centuries: భారత క్రికెట్ లెజెండర్ సునీల్ గవాస్కర్ మరోసారి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగితే 100 శతకాలు పూర్తి చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 సెంచరీలు ఉన్నాయి.. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ 100 శతకాల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్న బ్యాట్స్‌మన్‌గా కోహ్లీని భావించినప్పటికీ, మధ్యలో కొంతకాలం ఫాంలో లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.. కానీ, టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు.. అయినప్పటికీ అతడి ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని, 100 శతకాల మైలు రాయిని చేరుకోవడం సాధ్యం అవుతుందని గవాస్కర్ అన్నారు.
అయితే, కోహ్లీ మరో మూడేళ్లు ఆడితే 16 శతకాలను ఈజీగా కొడతాడు అని గవాస్కర్ తెలిపారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలు చేశాడు.. ఇలాగే ఆడితే న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో మరో రెండు శతకాలు కొడితే 87కి చేరిపోతాడని పేర్కొన్నాడు. కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, క్రికెట్‌ని ఇప్పుడు పూర్తిగా ఆస్వాదిస్తున్నాడని వెల్లడించారు.
Read Also: Indian Cricketers Retirement 2025: రో-కోతో పాటు 2025లో రిటైర్ అయిన భారత ఆటగాళ్ల జాబితా ఇదే..
ఇక, విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో 30 సెంచరీలు చేశాడు. 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేయగా.. టీ20ల్లో ఒక శతకం చేయగా, వన్డేల్లో 53 శతకాలను కొట్టాడు. అయితే, సచిన్ టెండూల్కర్ 51 టెస్ట్, 49 వన్డే శతకాలతో మొత్తం 101 అంతర్జాతీయ శతకాలతో రిటైర్ అయ్యాడు. సచిన్ 24 ఏళ్ల కెరీర్‌లో 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, కోహ్లీ 2008 నుంచి ఇప్పటి వరకు 556 మ్యాచ్‌లు ఆడాడు. కాగా, విరాట్ కోహ్లీ 2026 జనవరిలో న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో మళ్లీ ఆడనున్నాడు. భారత్–న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నందున, వీరు ఇద్దరు ఈ సిరీస్‌లో తిరిగి ఆడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
