Virat Kohli: క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అంటేనే రికార్డుల రారాజు. అయితే గత కొంతకాలంగా సెంచరీలకు దూరంగా ఉన్న కోహ్లీ ఇటీవల ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌లో చెలరేగి సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్‌లో 71వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలోనూ కోహ్లీ క్రేజ్ మరింత పెరుగుతోంది. తాజాగా ట్విట్టర్‌లో ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీ 50 మిలియన్ (5 కోట్లు) మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డును అందుకున్న తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. దీంతో అటు క్రికెట్‌లో పరుగుల విషయంలో.. ఇటు సోషల్ మీడియాలో ఫాలోవర్ల విషయంలో కోహ్లీ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు.
Read Also:Dasara Holidays 2022: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈ సారి దసరా సెలవులు 15 రోజులు
ఓవరాల్‌గా ఆటగాళ్ల పరంగా చూసుకుంటే ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్నారు. క్రిస్టియానో రొనాల్డో (103.4మిలియన్లు) 10 కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉన్నాడు. మరో ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్ మర్ (57.9 మిలియర్లు), 57.9కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. క్రికెటర్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 211 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే 21 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో 310 మిలియన్లకు పైగా కోహ్లీని ఫాలో చేస్తున్నారు. అంటే 31 కోట్ల మంది భారత క్రికెట్ దిగ్గజాన్ని అనుసరిస్తున్నారు. కాగా రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. అతడు ఆసియా కప్ ఫామ్‌ను కొనసాగించి రాణిస్తే టీ20 ప్రపంచకప్ గెలవడం కష్టమేమీ కాదు.

1