Virat Kohli: గంగూలీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్.. ఏం చేశాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Gives Return Gift To Sourav Ganguly: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు & ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య చాలాకాలం నుంచి విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే! కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు మొదలైన వీరి మధ్య గొడవ.. క్రమంగా ముదురుతూ వస్తోంది. రీసెంట్గా ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వెలుగుచూసిన పరినామాల నేపథ్యంలో.. వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గంగూలీకి కోహ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..
Yo Yo Honey Singh: హీరోయిన్‌తో డేటింగ్.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్.. వీడియో వైరల్
Also Read
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగినప్పుడు.. గంగూలీ వైపు కోహ్లీ పలుమార్లు గుర్రుగా చూశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో.. కోహ్లీకి గంగూలీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ముందుకు దాటేశాడు. ఆ టైంలో కోహ్లీ మరో ప్లేయర్‌తో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. గంగూలీ తన కోసం వెయిట్ చేయకుండా అలా ముందుకు వెళ్లిపోవడంతో.. కోహ్లీ అతనివైపు మరోసారి గుర్రుగా చూసినట్టు చూసి వెళ్లిపోయాడు. బహుశా తనకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే కోపమో ఏమో తెలీదు కానీ.. లేటెస్ట్గా కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేశాడు. అయితే.. గంగూలీ మాత్రం కోహ్లీని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. మరి, ఇందుకు గంగూలీ ఎలా సమాధానం ఇస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్‌తో సహజీవనం.. కట్ చేస్తే..
ఇదిలావుండగా.. ఏప్రిల్ 15వ తేదీన డీసీ, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే! తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (50) అర్థశతకంతో చెలరేగాడు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితం అయ్యింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, ఢిల్లీ బ్యాటర్లు చతికిలపడ్డారు. ఆర్సీబీ బౌలర్లలో వైశాక్ విజయ్ కుమార్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?