Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ మరోసారి తన అసాధారణ బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ వీరవిహారం చేశాడు. ఇప్పటికే వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని అధిగమించి చరిత్రాత్మక రికార్డు సృష్టించిన ఆయన, ఈ మ్యాచ్‌లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ ప్రారంభం నుంచే తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ కీలక దశలో గుడకేష్ మోతీ వేసిన 37.4 ఓవర్లో కోహ్లీ అద్భుతమైన షాట్ ఆడాడు. ఆఫ్‌స్పిన్ బంతిని అంచనా వేసి క్రీజు ముందుకు వచ్చి లాంగాన్ మీదుగా అదిరిపోయే సిక్సర్ బాదడంతో కోహ్లీ తన వన్డే కెరీర్లో అద్భుతమైన 55వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఈ మెరుపు శతకాన్ని కేవలం 74 బంతుల్లోనే సాధించడం విశేషం. ఈ అజేయ శతకంలో కోహ్లీ 6 ఫోర్లు, మరో 6 భారీ సిక్సర్లు బాది 135.14 స్ట్రైక్ రేట్‌తో చెలరేగాడు. అంతకుముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అద్భుతమైన శతకం (110 పరుగులు) సాధించి జట్టును విజయతీరాల వైపు నడిపించాడు. గిల్‌తో కలిసి కోహ్లీ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
ప్రస్తుతం భారత్ విజయానికి కేవలం కొన్ని పరుగుల దూరంలో ఉండగా, కోహ్లీ అజేయ ఇన్నింగ్స్ జట్టు విజయాన్ని లాంఛనం చేసింది. రికార్డులే దాసోహమనేలా విరాట్ కోహ్లీ సాధించిన ఈ శతకం క్రికెట్ అభిమానులలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది. తన సుదీర్ఘ కెరీర్లో మరోసారి తన క్లాస్ ఏంటో నిరూపించుకున్న కోహ్లీ, మరోసారి భారతీయ క్రికెట్ కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో కోహ్లీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
అంతే కాకుండా.. ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకపై 10 వన్డే సెంచరీలు బాదిన కోహ్లీ, తాజాగా వెస్టిండీస్‌పై కూడా తన 10వ శతకాన్ని పూర్తి చేసుకుని ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు, అలాగే శ్రీలంకపై 8 సెంచరీలు సాధించగా, రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియాపై 9 సెంచరీలతో ఆ సరసన నిలిచారు. అలాగే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 8 వన్డే సెంచరీలు బాది మరో రికార్డును తన పేరున లిఖించుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!