భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంచనల వ్యాఖ్యలు చేసారు. అతని లాగా పాకిస్థాన్ వీధుల్లో పిలల్లు బౌలింగ్ చేస్తారు అని అన్నాడు. అయితే ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే వరుణ్ మంచి పేరు తెచ్చుకొని.. మొదట శ్రీలంక పర్యటనకు అలాగే ఇప్పుడు ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో చోటు దకించుకున్నాడు. కానీ ఈ ఆదివారం భారత్ పాకిస్థాన్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో మాత్రం వరుణ్ అంతగా ప్రభావం చూపించలేకపోయారు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన వరుణ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే ఈ మ్యాచ్ లో వరుణ్ వేసిన బౌలింగ్ పై సల్మాన్ భట్ మాట్లాడుతూ… అతను మిస్టరీ స్పిన్నర్ కావచ్చు. కానీ అతని వల్ల పాకిస్థాన్ జట్టుకు పెద్దగా నష్టం ఏమి లేదు అన్నాడు. అతను వేసే బంతులను ఇక్కడ పాకిస్థాన్ లో వీధుల్లోపిల్లలు వేస్తారు. ఇక్కడ పిల్లలు టేప్ బాల్ తో ఆడుతున్న సమయంలో అతిలాగానే బౌలింగ్ చేస్తారు అని కామెంట్స్ చేసాడు.