ఒక్క తప్పు.. కేవలం ఒకే ఒక్క తప్పు వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్లేఆఫ్స్‌కు వెళ్ళే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. ఆ తప్పు చేసిన కెప్టెన్ రిషభ్ పంత్.. అందరి దృష్టిలో విలన్ అయ్యాడు. ఒకవేళ ఆ తప్పు జరగకపోయి ఉంటే, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది. ఆ వివరాల్లోకి వెళ్తే.. 15వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ మొదట డెవాల్డ్ బ్రెవిస్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి టిమ్ డేవిడ్…