Tom Latham: బుధవారం నాడు భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే సందర్భంగా మంగళవారం నాడు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్.. అందులోనూ ఇండియాలోనే వరల్డ్ కప్ జరగబోతోంది కాబట్టి తమకు ఈ సిరీస్ ముఖ్యమైనదిగా భావిస్తున్నామని టామ్ లాథమ్ తెలిపాడు. విలియమ్సన్, సౌథీ లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించిందని. ఇది కూడా మంచి పరిణామం అని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌పై వాళ్ల స్వదేశంలో 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచామని… అక్కడ కూడా ఏషియన్ కండిషన్స్ కాబట్టి అది కూడా తమకు అడ్వాంటేజ్ అయిందన్నాడు. ఇండియాలో పిచ్‌లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటాయని.. పిచ్‌కు తగ్గట్టు రాణించే టీం తమతో ఉందని.. అందరం ఐపీఎల్‌లో కలిసే ఆడాం కాబట్టి.. ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటో తమ తెలుసు అని టామ్ లాథమ్ అన్నాడు.
Read Also: Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. మరో 550కోట్లు విడుదల చేసిన సర్కార్
మరోవైపు శ్రీలంక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని తొలి వన్డేకు రెడీ అయింది. కివీస్‌తో సిరీస్‌లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో ఆడిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాల వల్ల దూరం కావడంతో అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలనే డైలమా ఏర్పడింది. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని పలువురు సూచిస్తున్నా అతడు ఓపెనర్ కాబట్టి మిడిలార్డర్‌లో ఆడే కేఎల్ రాహుల్ స్థానంలో కేఎస్ భరత్‌కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. దీంతో భరత్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది.