నేడే సఫారీ గడ్డపై టెస్ట్ ఫైట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సఫారీ గడ్డపై టెస్ట్ ఫైట్‌కు సిద్ధమైంది… టీమిండియా. ఇప్పటివరకూ అందని టెస్ట్ సిరీస్‌ను… ఈసారి ఎలాగైనా సాధించాలన్న కసితో ఉంది. మరోవైపు ప్రొటీస్ కూడా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రాభవం కోల్పోయిన జట్టును… మళ్లీ తలెత్తుకునేలా చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నారు.
ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఇవాళ్టి నుంచి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ వేట మొదలెట్టబోతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్న కోహ్లీ సేన.. దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోబోతోంది. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమవడంతో… కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగబోతున్నారు.
పుజారా, కోహ్లీ, రిషబ్‌పంత్‌లతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. అయితే, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. న్యూజిలాండ్‌తో కాన్పూర్ టెస్టులో సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న తాజా మాజీ వైస్‌కెప్టెన్ అజింక్య రహానే, తెలుగు ఆటగాడు హనుమ విహారి ఐదో స్థానం కోసం పోటీ పడుతున్నారు. సఫారీ గడ్డపై మంచి రికార్డు ఉన్న రహానే వైపు కోహ్లీ మొగ్గుచూపుతాడా? లేక ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌పై నమ్మకముంచుతాడా? అనేది చూడాలి.
Also Read
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగబోతున్నట్లు ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రవిడ్ హింట్ ఇవ్వడంతో… బుమ్రా, మహమ్మద్ సిరాజ్, షమీతో పాటు శార్దూల్ ఠాకూర్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ బరిలోకి దిగబోతున్నాడు.
ఇక దక్షిణాఫ్రికా జట్టు విషయానికొస్తే… సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత… ఆ టీమ్ డీలా పడింది. బోర్డు ఆర్థిక నష్టాలు కూడా ఆటగాళ్లపై ప్రభావం చూపాయి. ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ జట్టుపై సొంత గడ్డ మీద విజయం సాధించడం ద్వారా… తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది… సఫారీ టీమ్.
ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. పచ్చికతో నిండిన సెంచూరియన్ పిచ్‌పై తొలి రోజు నుంచే సీమర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉండగా.. మ్యాచ్ సాగే కొద్దీ మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు రోజుల్లో వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించే వచ్చనేది… లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!