సఫారీ గడ్డపై టెస్ట్ ఫైట్‌కు సిద్ధమైంది… టీమిండియా. ఇప్పటివరకూ అందని టెస్ట్ సిరీస్‌ను… ఈసారి ఎలాగైనా సాధించాలన్న కసితో ఉంది. మరోవైపు ప్రొటీస్ కూడా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రాభవం కోల్పోయిన జట్టును… మళ్లీ తలెత్తుకునేలా చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఇవాళ్టి నుంచి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ వేట మొదలెట్టబోతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా…