Third Umpire Ignore MS Dhoni Big Mistake in RCB vs CSK Match: టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీపింగ్ విషయంలో ఎంత ప్రావీణ్యుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బ్యాటర్‌ను దాటి బంతి తన చేతికి దొరికిందంటే చాలు.. కనురెప్పపాటులోనే బెయిల్స్ ఎగిరిపోతాయి. తన కీపింగ్ స్కిల్స్‌తో ధోనీ ఎన్నో మ్యాచెస్‌ని మలుపు తిప్పాడు. అలాంటి ధోనీ.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చాలా పెద్ద తప్పు చేశాడు. దాన్ని థర్డ్ అంపైర్ కూడా గుర్తించకపోవడంతో.. నెట్టింట్లో అది చర్చకు దారితీసింది. ఆర్సీబీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ.. అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ తప్పేంటంటే..
పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?
15వ ఓవర్‌లో జడేజా వేసిన ఐదో బంతిని ఆర్సీబీ బ్యాటర్ కార్తిక్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది మిస్ అయి, వెనుక ఉన్న ధోనీ చేతిలోకి వెళ్లింది. అప్పుడు ధోనీ వెంటనే బెయిల్స్ ఎగరగొట్టాడు. ఇది ఔటో, కాదో తేల్చేందుకు.. థర్డ్ అంపైర్‌ను ఫీల్డ్ అంపైర్ ఆశ్రయించగా, అది నాటౌట్‌గా తేలింది. ఇక్కడే థర్ట్ అంపైర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ధోనీ చేసిన అది పెద్ద తప్పును వదిలేశాడు. ఇంతకీ ఆ తప్పేంటంటే.. ధోనీ ఆ బంతిని ‘స్టంప్ లైన్’కి ముందే అందుకోవడం. నిబంధనల ప్రకారం.. స్టంప్ లైన్‌ని పాస్ అయిన తర్వాతే బంతిని కీపర్ అందుకోవాలి. ఒకవేళ ఈ నిబంధనని ఉల్లంఘిస్తే.. దానిని నో-బాల్‌గా పరిగణిస్తారు. ఇక్కడ ధోనీ ఆ బంతిని స్టంప్‌లైన్ ముందే తీసుకోవడం చాలా స్పష్టంగా కనిపించింది. కానీ.. థర్డ్ అంపైర్ మాత్రం ఈ విషయాన్ని గమనించలేదు. దీంతో.. ఆర్‌సీబీకి నోబాల్ అవకాశం మిస్ అయింది.
Heatwave in India: దేశంలో అత్యంత వేడిగా ఉండే నగరాలు ఇవే !
ఒకవేళ థర్ట్ అంపైర్ ఆ విషయాన్ని గమనించి ఉంటే.. ఆర్సీబీ ఖాతాలోకి నో-బాల్ వచ్చి ఉండేది. అప్పుడు పరిస్థితులు తప్పకుండా వేరేలా ఉండేవి. ఎందుకంటే.. అప్పటికే కార్తిక్ మంచి జోష్‌లో ఉన్నాడు. పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అలాంటప్పుడు నో-బాల్ ఛాన్స్ వచ్చి ఉంటే.. ఒక బంతి ఎక్స్‌ట్రాగా వచ్చేది. తద్వారా ఫలితాల్లో మార్పులు వచ్చి ఉండేవి. కానీ.. థర్ట్ అంపైర్ ధోనీ చేసిన తప్పును గమనించకపోవడంతో ఆర్‌సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ‘‘థర్డ్ అంపైర్ సీఎస్‌కే తరపున అనుకూలంగా ఉన్నట్టున్నాడు.. అందుకే నోబాల్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే కచ్చితంగా ఆర్‌సీబీ గెలిచి ఉండేది’’ అంటూ మండిపడుతున్నారు.