నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణుడి కారణంగా తొలి టెస్ట్‌లో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన టీమిండియా.. సిరీస్‌లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో గురువారం నుంచి జరిగే రెండో టెస్ట్‌లో భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్ ఆఖరి రోజు వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా కనిపించినా.. టాపార్డర్ వైఫల్యం కలవరపాటుకు గురి చేస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు చటేశ్వర్ పుజార, అజింక్యా రహానె పేలవ ప్రదర్శన కనబర్చగా.. కేఎల్ రాహుల్, జడేజా అర్ధ శతకాలతో ఆదుకున్నారు. కాగా, గాయం కారణంగా పేసర్ శార్దూల్ ఠాకూర్ రెండో మ్యాచ్‌కు దూరం కావడంతో.. కోహ్లీ 4-1 పద్ధతిని మార్చుకోవాల్సి రావచ్చు. నెట్ సెషన్‌లో శార్దూల్‌కు కండర గాయం కావడంతో.. అతడి స్థానంలో అశ్విన్‌కు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నలుగురు పేసర్లుతో దిగాలనుకుంటే ఇషాంత్ లేదా ఉమే్‌షకు చాన్స్ దక్కొచ్చు. పేస్ గన్ బుమ్రా గాడిలో పడడం జట్టుకు లాభదాయకం. అతడికి షమి, సిరాజ్ నుంచి మంచి సహకారం అందుతోంది.
జట్లు (అంచనా)
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
భారత్: రోహిత్, రాహుల్, పుజార, కోహ్లీ, రహానె, రిషభ్ పంత్, జడేజా, అశ్విన్/ఇషాంత్/ఉమే్‌ష, షమి, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: బర్న్స్, సిబ్లే, క్రాలే/హసీబ్ హమీద్, రూట్, బెయిర్‌స్టో, బట్లర్, మొయిన్ అలీ, శామ్ కర్రాన్, ఓలీ రాబిన్సన్, మార్క్ ఉడ్, క్రెయిగ్ ఓవర్టన్/సకీబ్ మహమూద్.
- Tags
- england
- india
- Test series
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!