Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. శనివారం న్యూచండీగఢ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. సిరీస్‌లో చాలా అంశాలు సంతృప్తినిచ్చినప్పటికీ, ఇంకా కొన్ని విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ముఖ్యంగా ప్రపంచకప్‌కు ముందు ఫీల్డింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
‘మేము అనుకున్న చాలా విషయాలను సాధించాం. అయితే ఇంకా కొన్ని అంశాలను మెరుగుపరచాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో జట్టు సాధించిన స్కోరుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మ్యాచ్ మా నియంత్రణలోనే ఉందని భావించాను. కానీ మంచు ప్రభావంతో నాలుగు ఓవర్లు వెనుకబడటం, చివర్లో పరిస్థితులు మారడంతో ప్రత్యర్థి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. ఓవర్లను కుదించాల్సిన పరిస్థితి రాకపోయి ఉంటే మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లే అవకాశం ఉండేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. మంచు ప్రభావమే మా ఓటమికి ప్రధాన కారణం’ అని శుభ్‌మన్ గిల్ చెప్పాడు.
Also Read
- Harry Brook: డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం.. చాలా బాధగా ఉంది!
- SL Vs Eng: ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో నమోదైన 10 అద్భుతమైన రికార్డులు.. లిస్ట్ ఇదే..
- HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
- Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
‘కుల్దీప్ యాదవ్‌ను ముందుగానే బౌలింగ్‌కు తీసుకురావాలనే ఆలోచన రాలేదు. పరిస్థితుల కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నాము. గుర్నూర్ సింగ్‌కు క్రాంప్స్ రావడంతో అతను తిరిగి బౌలింగ్ చేయగలడో లేదో మాకు స్పష్టత లేదు. దాంతో కొంత అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ చివరి వరకు వెళ్తుందని మాకు తెలుసు. కుల్దీప్ వికెట్లు తీసే బౌలర్. అందుకే అతడి కొన్ని ఓవర్లను చివరి దశలో ఉపయోగించుకోవాలని భావించాను’ అని గిల్ వివరించాడు.
2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టు ప్రదర్శనపై కూడా గిల్ స్పందించాడు. గాయాలు, మారుతున్న కాంబినేషన్ మధ్య జట్టు ఇప్పటివరకు బాగానే ముందుకు సాగిందని చెప్పినా.. ఫీల్డింగ్ విషయంలో మాత్రం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అంగీకరించాడు. ‘మొత్తంగా చూస్తే సంతృప్తిగానే ఉన్నాను. కానీ మా ఫీల్డింగ్ ఇంకా చాలా మెరుగ్గా ఉండాలి. ఈ సిరీస్‌లోనే మేము ఆరు లేదా ఏడు క్యాచ్‌లు వదిలేశాం. ప్రపంచ కప్‌కు ముందు ఇది మంచిది కాదు. ఫీల్డింగ్‌లో అత్యున్నత ప్రమాణాలు సాధించాలి’ అని గిల్ పేర్కొన్నాడు.
డెత్ ఓవర్ల బౌలింగ్ కూడా భారత జట్టు మెరుగుపర్చుకోవాల్సిన మరో అంశమని గిల్ తెలిపాడు. ‘డెత్ బౌలింగ్‌లో కొన్నిసార్లు మేం అటాక్ చేస్తున్నామా? డిఫెండ్ చేస్తున్నామా? అనే విషయంలో స్పష్టత ఉండటం లేదు. ప్రత్యర్థి ఐదు లేదా ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో ఏ ఫీల్డ్ సెట్ చేయాలన్న దానిపై కూడా కొంత సందిగ్ధత ఉంటుంది. డెత్ ఓవర్లను చాలా ముందుగానే ప్రారంభిస్తున్నామా? లేదా మిడిల్ ఓవర్ల తరహాలోనే బౌలింగ్ చేస్తున్నామా? అనే విషయంలో మరింత స్పష్టత అవసరం. ఈ అంశాల్లో తప్పకుండా మెరుగుపడాలి’ అని భారత కెప్టెన్ గిల్ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో తాను భారీ స్కోరు చేయకుండానే ఔటవడంపై కూడా గిల్ స్పందించాడు. ‘ఎవరైనా తక్కువ స్కోరుకే ఔటైతే నిరాశ సహజమే. కానీ ఈరోజు నేను ఎదుర్కొన్న ఆ బంతికి అంతకంటే ఎక్కువ చేయగలనని నాకు అనిపించడం లేదు’ అని చెప్పాడు. మూడో వన్డేలో భారత్ ఓడిపోయినప్పటికీ.. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాల కారణంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్‌లో తమ బలాలు, బలహీనతలను గుర్తించిన భారత్.. ముఖ్యంగా ఫీల్డింగ్, డెత్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గిల్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
India vs Pakistan at UN: ‘పాకిస్థాన్ మాకు నీతులు చెప్పొద్దు’.. ఐరాసలో మైనారిటీల హక్కులపై భారత్ ఘాటు వ్యాఖ్యలు
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
Harry Brook: డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం.. చాలా బాధగా ఉంది!
-
Sai Krishna Death Case: విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ..
-
Motorola Razr Flex లీక్.. 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోల్డబుల్ ఫోన్!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!