Commonwealth Games: హైజంప్‌లో భారత్‌కు పతకం.. తొలి అథ్లెట్‌గా తేజస్విన్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejaswin Shankar Won India First Medal In High Jump At CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించాడు. దీంతో.. కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా అతను రికార్డ్ నెలకొల్పాడు. బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్ ఫైనల్స్‌లో శంకర్ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. అయితే.. జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేశాడు. ఆ రికార్డ్‌తో పోలిస్తే, కామన్వెల్త్‌తో 0.05 మీటర్ల తేడా వచ్చింది. ఇది కొంచెం నిరాశజనకమే.
కానీ.. హైజంప్‌లో దేశానికి తొలి పతకం తీసుకొచ్చిన అథ్లెట్‌గా అతను చరిత్రపుటలకెక్కాడు. ఈ సందర్భంగా శంకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘తేజస్విన్ శంకర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు శంకర్‌కు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం.. ‘‘కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు’’ అంటూ శంకర్‌ను ప్రశంసించారు.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
కాగా.. హైజంప్ విభాగంలో న్యూజీల్యాండ్‌కు చెందిన హీష్ కెర్ 2.25 మీటర్లు జంప్ చేసి, స్వర్ణం సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ రెండో స్థానంలో నిలిచి, సిల్వర్ సొంతం చేసుకున్నాడు. తేజస్విన్ శంకర్ సాధించిన పతకంతో.. భారత్ ఖాతాలో ఇప్పటివరకు 18 పతకాలు వచ్చాయి. అందులో 5 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!