Team India Won: ఉత్కంఠ పోరులో టీమిండియా విక్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరేబియన్ పర్యటనను విజయంతో ప్రారంభించింది… టీమిండియా. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి వన్డేలో… 3 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. ఆఖరి బంతి దాకా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ భారత యువజట్టు.. విజేతగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు… ఓపెనర్లు శిఖర్ ధవన్, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో… గిల్ రనౌట్ కావడంతో… సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. 53 బంతుల్లోనే 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 64 పరుగులు చేశాడు… గిల్. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ధాటిగా ఆడాడు… ధవన్. ఇద్దరూ రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న ధవన్… 97 పరుగుల దగ్గర ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ రాణించలేకపోయినా… చివర్లో దీపక్ హుడా, అక్సర్ పటేల్ ధాటిగా ఆడటంతో… 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు చేసింది… టీమిండియా.
Read Also: BS Yediyurappa Retirement: రాజకీయాలకు గుడ్‌బై.. ఇక నా వళ్లకాదు అంటున్న సీనియర్ పొలిటీషియన్
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ఇక, 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్… ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఐదో ఓవర్లోనే ఓపెనర్ హోప్ వికెట్ కోల్పోయినా… మరో ఓపెనర్ కైల్, వన్‌డౌన్‌లో వచ్చిన బ్రూక్స్… టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో వికెట్‌కు ఇద్దరూ వంద పరుగులకు పైగా జోడించారు. కైల్ 75 రన్స్ చేస్తే, బ్రూక్స్ 46 పరుగులు తీశాడు. ఐదు పరుగుల వ్యవధిలో ఇద్దరూ ఔటైనా… ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం ఒత్తడికి లోనుకాకుండా ఆడారు. బ్రాండన్ కింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఔటైతే… పూరన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో 25 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. 196 పరుగులకు 5 వికెట్లు పడిపోవడంతో… విండీస్ బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఆడారు. దాంతో రన్‌రేట్ పెరిగిపోయింది. చివర్లో షెపర్డ్, హోసన్ ధాటిగా ఆడి… ధవన్ సేనను కంగారు పెట్టారు. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా… సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 11 రన్సే ఇచ్చాడు. దాంతో… చివరి బంతికి 3 పరుగుల తేడాతో నెగ్గింది ధవన్ సేన. భారత బౌలర్లలో సిరాజ్, కృష్ణ, చాహల్ తలో రెండు వికెట్లు తీశారు. 97 పరుగులు చేసిన కెప్టెన్ ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక రెండో వన్డే రేపు జరగనుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!