IND Vs BAN: రాణించిన బౌలర్లు.. నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ భారీ గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs BAN: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో ముగించింది. ఇప్పటికే రెండు వన్డేలలో ఓటమి చెంది సిరీస్ కోల్పోగా శనివారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా విశ్వరూపం చూపించింది. దీంతో బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. 410 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో షకీబుల్ హసన్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యాసిర్ అలీ 21, మహ్మదుల్లా 20 పరుగులు చేశారు.
Read Also: Team India: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టెస్ట్ జట్టులో ఉనద్కట్కు చోటు
Also Read
- Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా వన్డేల్లో ఇది టీమిండియాకు మూడో అతిపెద్ద గెలుపు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతుల్లో 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. అతడికి విరాట్ కోహ్లీ మంచి సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ కెరీర్లో 44వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్, ఎబాడట్ హుస్సేన్, టస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు సాధించారు. ముస్తాఫిజుర్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ తీశారు. కాగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై తొలిసారిగా టీమిండియాపై వన్డే సిరీస్‌ను ఆ జట్టు గెలుచుకుంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!