AUS vs IND: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
- ఛాంపియన్స్ ట్రోఫీ: టీమిండియా టార్గెట్ 265 పరుగులు..
- 49.3 ఓవర్లలో 264 పరుగుల దగ్గర ఆస్ట్రేలియా ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs IND: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73: 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ క్యారీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకాలతో రాణించగా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (39), మార్కస్ లబుషేన్ (29)లు కూడా ఫర్వాలేదనిపించారు. జోస్ ఇంగ్లిష్ (11), గ్లెన్ మ్యాక్స్ వెల్ (11)లు పెయిల్ అయ్యారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా ఓ వికెట్ పడగొట్టారు.
Read Also: Yogi Adityanath: మతపరమైన అంశాలతో ఆడుకుంటున్నారు.. సమాజ్‌వాదీ పార్టీపై యూపీ సీఎం ఫైర్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే మహ్మద్ షమీ షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి ఓపెనర్ కూపర్ కొన్నోలీ డకౌట్ అయ్యాడు. ఇక, మరో ఎండ్‌లో వన్ డౌన్లో వచ్చిన స్టివ్ స్మిత్‌తో కలిసి హెడ్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇక, రంగంలోకి దిగిన వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్‌నే ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేశాడు. రెండో వికెట్‌కు హెడ్-స్మిత్‌లు 50 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఆరంభంలో క్రీజులో కుదురుకునేందుకు కాస్త ఇబ్బంది పడిన స్మిత్.. ఆ తర్వాత తనదైన స్టైల్లో ఆడుతూ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు లబుషేన్‌తో మూడో వికెట్‌కు 56 రన్స్, జోష్ ఇంగ్లిష్తో కలిసి నాలుగో వికెట్‌కు 34 పరుగులు జత చేశారు. ఈ దశతో స్మిత్‌కు అలెక్స్ కేరీ జత కలవడంతో.. వీరిద్దరు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ఆసీస్ కెప్టెన్ 68 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత శతకం దిశగా వెలుతున్న అతడ్ని షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు.
Read Also: PM Modi: జామ్‌నగర్ ఫారెస్ట్ వీడియో పోస్ట్ చేసిన మోడీ.. కనువిందు చేస్తున్న జంతువులు
ఇక, స్టీవ్ స్మిత్-కేరీ జోడి ఐదో వికెట్‌కు 54 రన్స్ జోడించారు. స్మిత్ ఔటైన తరువాత అలెక్స్ కేరీ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో.. హాఫ్ సెంచరీ కంప్లీ్ట్ చేసుకున్నాడు.. దూకుడుగా ఆడుతున్న అతడిని ఇన్నింగ్స్ చివరిలో అక్షర్ పటేల్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు సమయం పట్టేలేదు. కాగా, టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీసుకోగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీసుకోగా.. హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!