ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురుషుల క్రికెట్ ప్లేయర్స్ ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 102 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయం అందించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ ద్వారా అతనికి ఏకంగా 18 స్థానాల మెరుగుదల లభించి, కెరీర్లోనే అత్యుత్తమంగా 7వ స్థానానికి చేరుకున్నాడు.
టీ20 బ్యాటింగ్ జాబితాలో ఇషాన్ కిషన్ నంబర్-1 స్థానంలో కొనసాగుతుండగా.. అభిషేక్ శర్మ రెండో స్థానంలో ఉన్నారు. అలాగే తిలక్ వర్మ 10వ స్థానంలో నిలవడంతో, టాప్-10 బ్యాటర్లలో నలుగురు భారతీయులే ఉండటం విశేషం. ఇదే మ్యాచ్‌లో.. ఏషియన్ గేమ్స్ 2026లో ఆడిన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 8 స్థానాలు ఎగబాకి 46వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు హసన్ నవాజ్ 62 స్థానాలు మెరుగుపరుచుకుని 48వ స్థానాన్ని దక్కించుకున్నారు.
Also Read
- Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
- Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
- RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
- OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!
బౌలింగ్ విభాగంలో, ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్ , ఫైనల్ మ్యాచ్‌లలో అబర్రహ్ అహ్మద్ ప్రదర్శన తన అగ్రస్థానాన్ని కాపాడుకోవడానికి సరిపోలేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎనిమిదోసారి బౌలర్ల జాబితాలో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శనతో 16 స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి దూసుకెళ్లారు.
మరోవైపు వన్డే ఫార్మాట్లో భారత వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. గువాహటిలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో గిల్ అజేయంగా 223 పరుగులు సాధించి తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా అతనికి 25 రేటింగ్ పాయింట్లు దక్కడంతో పాటు, కెరీర్ బెస్ట్ 841 రేటింగ్ పాయింట్ల రికార్డును సమం చేసుకున్నాడు. ఈ పరిణామంతో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకం సాధించిన కేఎల్ రాహుల్ 7 స్థానాలు మెరుగుపరుచుకుని తిరిగి టాప్-10 జాబితాలోకి ప్రవేశించారు. భారత్ ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!