దక్షిణాఫ్రికాతో తలపడే టీమిండియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. గతంలో ప్రకటించిన జట్టులో వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడి సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు స్థానం కల్పించారు. ఈ మేరకు బౌలర్లు జయంత్ యాదవ్, నవదీప్ సైనీలను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జనవరి 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 19న తొలి వన్డే, 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించనున్నారు.
భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, ఆర్.అశ్విన్, భువనేశ్వర్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ
NEWS – Jayant Yadav & Navdeep Saini added to ODI squad for series against South Africa.
— BCCI (@BCCI) January 12, 2022
More details here – https://t.co/NerGGcODWQ #SAvIND pic.twitter.com/d14T9j3PgJ