T20 World Cup 2022: ముగిసిన క్వాలిఫయర్స్.. టీమిండియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారంతో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌ల నుంచి నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధించాయి. గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్ అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ క్వాలిఫై అయ్యాయి. వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత ప్రపంచకప్‌లో ఆడిన నమీబియా, స్కాట్లాండ్ స్థానంలో ఈ వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్, జింబాబ్వే వచ్చాయి. సూపర్-12లో ఆరేసి జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో న్యూజిలాండ్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్ ఉండగా.. గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22న జరిగే తొలి మ్యాచ్‌తో సూపర్ -12 పోరు ప్రారంభం అవుతుంది.
టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్
అక్టోబర్ 23న టీమిండియా తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. మెల్బోర్న్ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 30న పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. నవంబర్ 2న అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతుంది. నవంబర్ 6న మెల్బోర్న్ వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ నెట్వర్క్ ఛానళ్లతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం అవుతాయి.
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!