Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Team India Is Not Set In Opening Pair Before T20 World Cup

Team India: 12 నెలలు.. 9 మంది ఓపెనర్లు.. రోహిత్‌కు సరిజోడీ ఎవరో?

Published Date :July 30, 2022 , 3:52 pm
By Ramesh Nalam
Team India: 12 నెలలు.. 9 మంది ఓపెనర్లు.. రోహిత్‌కు సరిజోడీ ఎవరో?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Team India Opening Pair: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ముంచుకొస్తోంది. అయినా టీమిండియా సెట్ కాలేదు. మిడిలార్డర్, లోయరార్డర్ సంగతి దేవుడెరుగు. ముందు ఓపెనింగ్ జోడీ ఎవరంటే చెప్పలేని దుస్థితి నెలకొంది మన ఇండియా జట్టులో. ఎందుకంటే గత 12 నెలల్లో ఏకంగా 9 మందితో ఓపెనింగ్ జోడీలను టీమిండియా మేనేజ్‌మెంట్ పరీక్షించింది. కొంతమంది విజయవంతం అయినా వాళ్లను కొనసాగించకుండా కొత్తవాళ్లను పరీక్షిస్తూనే ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే ఈ వ్యవహారమంతా జరుగుతోంది. మాములుగానే అయితే రోహిత్-ధావన్ లేదా రోహిత్-కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు దిగుతుంటారు. కానీ ధావన్ ఫామ్ కోల్పోవడం.. రాహుల్ గాయపడటంతో రోహిత్‌కు జోడీగా పలువురు ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ బరిలోకి దింపుతోంది.

Vizag Zoo Park: బరితెగించిన యువకులు.. పందుల ఎన్‌క్లోజర్‌లోకి దూకి..Read Also:

గత 12 నెలల కాలంలో రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్, కేఎల్ రాహుల్-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్, సంజు శాంసన్-రోహిత్ శర్మ, దీపక్ హుడా-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-రిషభ్ పంత్ ఇన్నింగ్‌ను ఆరంభించిన మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ శర్మకు జత కట్టాడు. తాజాగా వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. తొలి మ్యాచ్‌లో అతడు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. సూర్యకుమార్ విఫలం కావడంతో రెండో మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్‌కు దిగుతారో చూడాలి. అతడి స్థానంలో రెండో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను క్రీజ్‌లోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిమానులు భావిస్తున్నారు. కాగా జట్టు విజయాలకు ఢోకా లేనందున కేఎల్ రాహుల్ జట్టులో పునరాగమనం చేసేంత వరకు ఈ ప్రయోగాలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • ind vs wi
  • KL Rahul
  • opening pair
  • rohit sharma

తాజావార్తలు

  • Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

  • Petrol, Diesel Prices: ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం!

  • Unbroken IPL Records: 18 సీజన్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా.. ఐపీఎల్ తొలి సీజన్ రికార్డులు

  • Hyderabad: హైదరాబాద్‌లో బంకులు మూసివేత వెనుక అసలు కారణం ఇదే.. కొత్త రూల్స్‌తో జనాల్లో పానిక్!

  • Sanju Samson: 21 సార్లు ఫెయిలైనా 22వ సారి ఛాన్స్ ఇస్తా అన్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన సంజు!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions