Team India Opening Pair: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ముంచుకొస్తోంది. అయినా టీమిండియా సెట్ కాలేదు. మిడిలార్డర్, లోయరార్డర్ సంగతి దేవుడెరుగు. ముందు ఓపెనింగ్ జోడీ ఎవరంటే చెప్పలేని దుస్థితి నెలకొంది మన ఇండియా జట్టులో. ఎందుకంటే గత 12 నెలల్లో ఏకంగా 9 మందితో ఓపెనింగ్ జోడీలను టీమిండియా మేనేజ్‌మెంట్ పరీక్షించింది. కొంతమంది విజయవంతం అయినా వాళ్లను కొనసాగించకుండా కొత్తవాళ్లను పరీక్షిస్తూనే ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే ఈ వ్యవహారమంతా…