WI vs NZ: టీ20 ప్రపంచకప్ సూపర్ 8కు వెస్టిండీస్.. న్యూజిలాండ్ ఇంటికి!
- రూథర్‌ఫోర్డ్ హాఫ్ సెంచరీ
- నాలుగేసిన అల్జారీ జోసెఫ్
- న్యూజిలాండ్ ఇంటికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Eliminate Form T20 World Cup 2024: ఆతిథ్య వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8కు దూసుకెళ్లింది. బ్రియాన్ లారా స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ 8కు అర్హత సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమవ్వడంతో విండీస్ 13 రన్స్ తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు ఓటములతో కివీస్ సూపర్ 8 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
ఇటీవలి ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ అద్భుతంగా రాణిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్ 2024 మాత్రం కివీస్‌కు కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ చేతిలో ఘోర పరాజయం చెందడం కివీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నెట్ రన్‌రేట్‌లో భారీగా వెనకపడింది. ఇక కీలకమైన రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో కివీస్ ఇంటికి వెళ్లడం ఖాయం అయింది. ప్రస్తుతం గ్రూప్-సీలో విండీస్ 3 మ్యాచ్‌ల్లో గెలిచి 6 పాయింట్లు (+2.596 నెట్ రన్‌రేట్) ఖాతాలో వేసుకుని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు (+5.225 నెట్‌రన్‌రేట్) రెండో స్థానంలో ఉంది. కివీస్ (-2.425) చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా అఫ్గాన్ రన్‌రేట్‌ను అధిగమించడం అసాధ్యం.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (68: 39 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 రన్స్ చేసి.. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గ్లెన్ ఫిలిప్స్ (40), ఫిన్ అలెన్ (26), మిచెల్ సాంట్నర్ (21 నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ (4/19), మోతీ (3/25) రాణించారు.
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!